Thursday, September 5, 2013

Neevu

నీవు

ఎదలో ఎన్నో భావాలు, ప్రాణం పోసే రూపాలు
ప్రతి కణం , అనుక్షనం ప్రతిధ్వనించే రాగాలు
చెప్పాలని ఉన్నా, గొంతు విప్పాలని ఉన్నా ఎందుకీ మౌనం?
నిజం తెలుసుకున్న ప్రాణం, మార్చునురా నీ నైజం.!నిరాశను వీడి చూడు ఒక్కసారి,
రహదారిలో నడిచిచూడు బాటసారి
గమ్యం తెలిసిన పయణం రా నీది,
జీవితం నేర్పిన  పాఠాలే పునాది.!

ఎవరో ఏదో అనుకుంటారనె ఆలోచనే అసలొద్దు,
మనసు చెప్పిందే వినరా, నింగే నీకు సరిహద్దు.
కృష్నుడు లేని కురుక్షేత్రం లో ఒంటరి వాడివి నీవేలే,
జననం మరణం సహజం రా, విజయం మాత్రం నీదేలే.!

చెరగని కలలే నీకుత్సాహం,
పడిలేచే అలలే నీకాదర్శం.
విజయం తోనె నీ బాంధవ్యం,
ప్రగతి పధం లో నీ భవితవ్యం.!

రెక్కలు వచ్చిన విహంగం లా, గగనం లో విహరించు
అంతే తెలియని తీరంలో, మునుముందుకే పయణించు
ఆంధ్యము తరిమి, వేకువ నింపే ప్రమిదవు రా,
ఉజ్జ్వలంగా ప్రజ్జ్వలించి కరిగిపోయే సమిదవురా.!

ఎందరో ఆప్తులు ఉండగ ఈ వేళ,
కాసులరాసులతొ పని నీకేల ?
మమతే కరువై, మనసే బరువైన నాడు,
లోకం శూన్యం, అల్లకల్లోలం చూడు.!

ఆగకపొంగే కన్నీళ్ళే కనబడకుండా దాచాలి,
హర్షించే వర్షం మాదిరిగ ఆకలి దప్పులు తీర్చాలి
నష్తాన్ని సైతం మరిపించి,కష్తాన్ని కూడ మురిపించు
వెతల స్మృతులు వదిలేసి, దరహాసపు వడిలో పవళించు.!

ఎదురు బెదురు లేదు, లేదు నీకు పోటి
లోకంలోనా, లోకుల్లోనా నీవేరా సరిసాటి
తలరాతని నమ్మే నిశ్చేస్టుడివి కావు,
తనరాతని రాసే నరేషుడివి నీవు.!
గమ్యం
మనిషి కోరికల ప్రతిబింబం
గెలుపే పొందని చదరంగం
అడుగడుగున అడుగును మనసు
ఎచటికి ఈ ప్రస్థానం ?
జవాబు ఆ విధాతకే తెలుసు
విధించినాడీ అవరోధం.!

మౌనంతో పోరాడిన ప్రాణం,
మౌనంగా ఓడిన వైనం
కాలం చూస్తుంది దయనీయంగా,
హుషారు ఆకలి షికార్ల నైజం.!

ఆకలి అరుపులు ఊపిరి పోసి,
చీకటి చరుపులు తోడుగ నిలచి
చేస్తున్నాయా కరాలనృత్యం?

కాలమే కాటువెస్తుంటే
కాటికేనా ఈ పయణం?
నిరాసతో సంచరిస్తుంటే
నింగికెగసేను నా గమ్యం..!

Wednesday, September 4, 2013


 

కవులకు అందని భావం నీవు
కల్లలో నిలిచిన రూపం నీవు
నీవు కోరిన చిరునామా చెలి హృదయం
ఒంటరి హృదయానికి తోడు నీ ఊహలు
జంటగ చేరిన ప్రేమికులకు నీ ఊసులే.....!

Saturday, July 20, 2013

అదృష్టవంతులండి


"మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.

"ఓ అలాగా... దానికేం భాగ్యం.... ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?
"ఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ... ఆయనంతట ఆయనే పోయారు"

Tuesday, July 9, 2013

Ninnu Chudalani Anipinchinapudu

intersting thing Ninnu Chudalani Anipinchinapudu Addham Mundu Niluchuni Prathibimbaanni Chusthanu.
Ni Peru Vinalani Anipichinappudu Na Gunde Pu Cheyi Vesi Gunde Chappudu Vintanu.
Ni Sparsha Kavalani Anipinchinapudu Chirugalilo Niluchoni Chethulu Chachi Nannu Nenu Hatthukuntanu.
Idanta

Nivu Levanna Brama Kadu
Nalo Nivu Vunnavanna Dheema