ఆమె
నన్ను భగ్న హృదయుడిని చేసింది.
నా
తలపులు చుట్టుముడుతున్నా- నన్ను
మరచిపోయానని
ఆత్మవంచన చేసుకుంది.
నాపై
మోహంతో తన శరీరంలో మరిగే
రక్తం
చారలై
కళ్ళలో ప్రతిఫలిస్తుందేమో
అన్న
భయంతో ఆమె గుండె వేగంగా
కొట్టుకుంటుంది.
ఆ
గుండె చప్పుళ్ళను ఆమెను కన్న తల్లి
కన్నా
నేనే బాగా వినగలను