Thursday, February 18, 2016

ప్రేమతో చాలా పొందగలం

ప్రదీప్   ఎప్పుడూ   ఒక   ముసలామె   దగ్గర  కమలాలు   కొంటాడు .
.
ఆ  రోజు   కూడా   కొన్నాడు .     ఆమెకు   డబ్బులు   ఇచ్చేశాడు  .   సంచీలోనుండి    ఒక  కమలా   తీసి  వలిచి ఒక  తొన తిన్నాడు  . 
.
"  అబ్బా   !  ఎంత   పుల్లగా   ఉందొ  !   ఈ పండు  వద్దు   .  నువ్వే  తిను   "  అంటూ   వలిచిన   పండును   ఆ  ముసలామెకు    ఇచ్చేశాడు .
.
.
  ఆమె  మిగిలిన  తోనలలోనుండి    ఇంకో  తోన  తీసి   తింది . 
.
" అదేమిటి   బాబూ  !  ఇంత  తియ్యగానే   ఉంటేనూ  ! "  అంటూ   ఉంటె  
,"   నాకు  ఒద్దు   నువ్వే  తిను  "  అంటూ    వచ్చేశాడు  .
.
.
కూడా  వస్తున్న    రాధిక   అడిగింది
.
" అదేమిటండీ  !   రోజూ   ఆమె  దగ్గరే  కొంటారు   .  ఆమె   తియ్యటివే  ఇస్తోంది   .  అయినా   రోజూ   పుల్లగా  ఉంది   అని ఒక  పండు   వెనక్కి   ఇచ్చేస్తారు   . అదేమీ  తెగులూ  ?  " 
.
"   ఆమె   అన్ని  పళ్ళను   అమ్ముతుంది .  కానీ  ఒక్కపండు  ఎప్పుడూ   తినదు   .  అందుకే   మా  అమ్మకే  పెడుతున్నా   అనుకుంటూ  రోజూ ఎదో  ఒక  వంక   పెట్టి    ఒక  పండు  ఆమె  తినేలా   చేస్తున్నా "  కళ్ళల్లో  కదులుతున్న కన్నీరు   రాధికకు   కనబడకుండా  దాచుకుంటూ   అన్నాడు   ప్రదీప్  .
.
..
.
ఇక్కడ   పక్కనే   పళ్ళు  అమ్ముతున్న  అతడు   అడుగుతున్నాడు  .
.
ఏమిటక్కా !   రోజూ   ఆయనకు   ఎక్కువ  పళ్ళు  తూస్తావూ  ?  ఆయనేమో   నీకు  అందులోంచి  ఒకటి   తీసి   వలిచి   ఇస్తాడూ  !   ఎందుకు  అలా  ఎక్కువ   తూస్తావూ  ?
.
.
"  అతను   నా  మీద  ప్రేమతో   నేను  పళ్ళు  తినాలి  అని   అలా  చేస్తున్నాడు   .  నాకు  తెలియదు   అనుకుంటున్నాడు  .  అతడికి    నా  మీద  ఉన్న  ప్రేమ  వలన   ఆ  తక్కెడ   అలా   ఎక్కువ  తూగుతుంది  అంతే  కానీ   నేను  తూచడం  లేదు  "  అంది   ఆ  ముసలామె 
.
జీవితం లో   ఇటువంటి   ఆనందాలు    కొద్ది మందికే   సాధ్యపడతాయి  .
.
డబ్బుతోనూ , అధికారం  తోనూ   పొందలేనివి  ్రేమతో   చాలా పొందగలం

Wednesday, February 17, 2016

తెలియక బయట వెతుకుతున్నాడు

💟🌻💟

బ్రహ్మ మనిషిని తయారు చేశాడు.
అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు.
ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నూరి నూరి నింపాడు.

ఆ తరువాత బ్రహ్మకి భయం పట్టుకుంది.
వీడు కాలాంతకుడు,
ప్రాణాంతకుడు,
దేవాంతకుడు అయిపోతాడేమో.....
కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.

"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.
"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు. ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు." అన్నాడు బ్రహ్మ.

"పోనీ ... నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.
"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."

"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.
"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."

అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.
"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం....." అంది.

"భేష్.... మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు.
అన్నిటినీ గెలుస్తాడు. కానీ తన లోపలికి వెళ్లలేడు.
తనను తాను గెలవలేడు. అక్కడే దాచేద్దాం,"
అన్నాడు బ్రహ్మ.

అప్పటి నుంచీ బలం తన లోపలే ఉంది.

కానీ మనిషి బయట వెతుకుతూనే ఉన్నాడు.   
                  
So search For Your Inner Power every one was Unique    

ALL IS WELL

💟🌇💟🌇💟🌇💟

Wednesday, June 17, 2015

నీ పిచ్చిలో నేను.


ప్రతి ఉదయం - సాయంత్రం
ఉషస్సు - సంధ్య - అపషోర్ణాహం
నీ నవ్వు - నీ స్పర్శ - నీ కళ్ళు
నీ శబ్దం - నీ మాట
నువ్వూ -నెనూ

నీ పిచ్చిలో నేను.

నా తలపులలోని నీకోసం

ఆమె నన్ను భగ్న హృదయుడిని చేసింది.
నా తలపులు చుట్టుముడుతున్నా- నన్ను
మరచిపోయానని ఆత్మవంచన చేసుకుంది.
నాపై మోహంతో తన శరీరంలో మరిగే రక్తం
చారలై కళ్ళలో ప్రతిఫలిస్తుందేమో
అన్న భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది.
గుండె చప్పుళ్ళను ఆమెను కన్న తల్లి కన్నా

నేనే బాగా వినగలను

యోగాతో ఇలాంటివన్నీ సాధ్యమే


వీడి నవ్వు చూస్తే ఎవరికైనా హార్ట్ ఎటాక్ రావలసిందే


టెక్నాలజీ ఉపయోగాలు


కొత్త కొత్త ఆలోచనలు


తల్లి బిడ్డల బంధం