Tuesday, December 20, 2016

*ఆ రోజులే బాగున్నాయ్* ! �----------�----------�

టెన్షన్లు..
ఒత్తిళ్లు... 
డబ్బు సంపాదన...
అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి...
ఆనందంగా గడిపిన .
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఆదివారం
ఆటలాడుతూ...
అన్నాన్ని మరచిన
�ఆ రోజులు బాగున్నాయ్..!

మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర,
బోరింగుల దగ్గర,
బావుల దగ్గర...
నీళ్లు తాగిన...
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఎండాకాలం
చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం..
ఎర్రని ఎండను సైతం
లెక్కచేయని...
�ఆరోజులు బాగున్నాయ్..!

వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో
శుక్రవారం చిత్రలహరి...
ఆదివారం సినిమా కోసం వారమంతా...
ఎదురు చూసిన
� ఆ రోజులు బాగున్నాయ్..!

సెలవుల్లో
అమ్మమ్మ..
నానమ్మల ఊళ్లకు వెళ్లి...
ఇంటికి రావాలనే ఆలోచన లేని...
� ఆ రోజులు బాగున్నాయ్..!

ఏసీ కార్లు లేకున్నా
ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి
ప్రకృతిని ఆస్వాదించిన
� ఆ రోజులు బాగున్నాయ్...!

మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ...
చాక్లెట్లు పంచిన
� ఆ రోజులు బాగున్నాయ్..!

మటన్ బిర్యానీ..
చికిన్ బిర్యానీ లేకున్నా...
ఎండాకాలం వచ్చిందంటే
మామిడి కాయ పచ్చడితో...
అందరం కలసి
కడుపునిండా అన్నం తిన్న...
� ఆరోజులు బాగున్నాయ్..!

ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా...
పరుసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే ...
మిగిలిన చిల్లర కాజేసిన
� ఆ రోజులే బాగున్నాయ్..!

సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన..
� ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...
� ఆ రోజులే బాగున్నాయ్...!

చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా
పెద్దలంతా కలసివుండే
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే ...
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు రకరకాల
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...
అమ్మ చీరకొంగు పైసలతో
పుల్ల ఐసు కొనితిన్న...
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!

పొద్దుపోయేదాకా
చేలో పని చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని
చందమామను చూస్తూ నిదురించిన..
� ఆ రోజులు బాగున్నాయ్..!

�ఆ రోజులు బాగున్నాయ్...�
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...�
*ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది*
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹
💑👨‍👨‍👧👨‍👩‍👦‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👦‍👦👩‍👩‍👦🌏💞

One million dollar

బ్రెజిల్ లో ఒక కోటీశ్వరుడు తన One Million Dollar ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!
నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే.. నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!!
అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని, One Million Dollar కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!!
మీడియాతో పాటుగా ప్రజలు కూడా చాలా తిట్టారు అతన్ని..!!
అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి రెడీగా ఉన్నారు..!! పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!!
అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా..
ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..? మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!! దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా.. అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!!

అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!
"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!! దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!!
ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!!
నిజమే కానీ మీరు మాత్రం వెలకట్టలేని...
మీ(మన) గుండె...
కళ్ళు...
ఊపిరితిత్తులు..
మూత్రపిండాలు..
ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి కదా..?
ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి కదా..?
వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని.. ఆలోచన కాని లేదు ఎందుకు..?
కారు పోయినా.. డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!!
మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?
వాటికి విలువ కట్టగలమా..?
మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేక పోతున్నాం..?
కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు కదా..?
మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..?
ఆలోచించండి..!!
అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!!
మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడానని అక్కడున్నవారి జ్ఞానోదయం కలిగించాడు ఆ పెద్దమనిషి.

అవయవ దాన ప్రాముఖ్యతను అందరికి తెలియజేయండి.

Saturday, December 17, 2016

*మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు దహనం చేస్తారో తెలుసా..?*

ప్రకృతి చాలా విచిత్రమైంది. అద్భుతమైంది కూడా. తాను తయారుచేసిన దానిని, తానే నాశనం చేసే ఆటోమేటిక్ సిస్టమ్ ను నేచర్ తయారుచేసుకుంది. మనిషి తయారుచేసినవి తప్ప, ప్రకృతి సహజసిద్ధంగా తయారుచేసే ఈ పదార్ధాన్నైనా, ఎటువంటి సంకోచం లేకుండా మళ్లీ తనలో కలిపేసుకుంటుంది. దీనికి మానవశరీరం అతీతం కాదు. ఐదు ప్రకృతి శక్తులు నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం. ఇవే భూమ్మీద ఉన్న జీవ కోటికి ఆధారం. వీటి నుంచే మానవశరీరం పురుడుపోసుకుంది. అందుకే, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దేహాన్ని ప్రకృతిలోనే కలిపే పద్ధతే దహన సంస్కారం..!

మనం పుట్టక ముందు లోకంలో మనకు సంబంధించినవేవీ లేవు. అలాగే మనం పోయిన తర్వాత కూడా, మనకు సంబంధించినవేమీ ఈ ప్రపంచంలో మిగలకూడదు అనే కాన్సెప్టే శవదహనం. దహనం ద్వారా అతని శరీరాన్ని పూర్తిగా అంతం చేయడం దీని వెనుక అర్ధం. ప్రపంచంలో ఒక్కో నిముషానికి లెక్కలేనంత మంది పుడుతుంటారు. లెక్కలేనంత మంది పోతుంటారు. మరి శవాన్ని పూడుస్తూ వెళ్తుంటే, కొంత కాలానికి మనుషులు ఉండే చోటుకంటే, శవాలు ఉండటానికి కావాల్సిన చోటే చాలా ఎక్కువ అవసరంగా మారుతుంది. బహుశా ఈ విషయాన్ని ముందే గ్రహించారో ఏమో కానీ, ప్రాచీన భారతీయులు శరీరదహనం పద్ధతినే పాటించేవారు.

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారీ దేవీ, కుంతీ దేవి వానప్రస్థాశ్రమానికి చేరుకున్నారు. మానవ జీవితంలో ఆఖరున వచ్చేది వానప్రస్థాశ్రమమే. ఆ ఆశ్రమ నియమం ప్రకారం దట్టమైన అడవుల్లో తపస్సు చేసుకుంటూ, కందమూలాలు తింటూ వారు బ్రతికేవారు. ఒక రోజు అడవిలో అగ్ని రాజుకుంది. శరవేగంగా మొత్తం అడవిని కబళించేస్తున్న అగ్నిని చూసి కూడా ఆ ముగ్గురూ బెదరలేదు. సంతోషంగా అగ్నికి ఆహుతైపోయారు. అయితే అంతకంటే ముందు, ధృతరాష్ట్రుడు గాంధారి, కుంతిలతో అగ్నిలో సంభవించే మరణానికి ఎంత ప్రాశస్త్యముందో, ఏ విధంగా ఉత్తమ గతులు ప్రాప్తించగలవో చెబుతాడు.

పంచభూతాల నుంచి ఏర్పడిన శరీరాన్ని, అవే పంచభూతాల్లో కలిపేయడమే దహనసంస్కారాల ఆచారం వెనుక ఉన్న ప్రధాన కారణం. ప్రాణం విడిచిన దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అలా కాలి భస్మంగా మారే పద్ధతిలో, ఆకాశంలో, గాలిలో శరీరం కలుస్తుంది. ఇక భస్మం కూడా భూమిలో మట్టిగా మారి కనుమరుగవుతుంది. ఆచారం పాటించేవారు ఆ భస్మాన్ని నీటిలో కలుపుతారు. దీంతో పంచభూతాలతో శరీరం తిరిగి ఐక్యమవుతుంది. ఇక అగ్ని, గంగానది..ఈ రెండూ ఈ లోకంలో అత్యంత పవిత్రమైనవి, పునీతమైనవి అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సమర్పించినవి దేవతలకు అందించేవాడు అని అగ్నికి, దేవతల దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చి పాపాలు కడుగుతుందని గంగకు పేరు. ఈ కారణం చేతనే బ్రతికినంత కాలం పాప భూయిష్టమైన మానవ శరీరాన్ని పవిత్రుడైన అగ్నికి ఆహుతిచ్చి, ఆ తర్వాత మిగిన చితాభస్మాన్ని పరమ పావని గంగలో కలిపేసి, ఆ వ్యక్తికి ఉత్తమగతులు సిద్ధించాలని ప్రార్ధిస్తారు. ఇదీ దహన సంస్కారాల వెనుక ఉన్న అసలు కారణం...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఎవరు పేదవారు - ఎవరు ధనవంతులు

ఎవరు పేదవారు???

              ⭐ ⭐ ⭐

ఒక  చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ!  నా కుమారుడి వివాహం.  కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది."

అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ.

కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి.

అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ.

ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు?
పేదరికం ఎక్కడ ఉంది ?
మనస్సులోనా?
గుణం లోనా?

సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది.

ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు.

ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???

             ⭐ ⭐ ⭐

ఎవరు ధనవంతులు ???

               🔯 🔯 🔯

ఒకసారి, తన కుటుంబం తో ఒక మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి.

పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీస్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది.

"తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు.

" కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!"

"పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.

కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.

మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే...

వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది.
తరువాత "ఎంత?"  అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది.

"మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ

ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.

ఆ మహిళ కారులో కుర్చున్న తరువాత ఆలోచించసాగింది.

నిజంగా ఎవరు ధనవంతులు ? త్రీస్టార్ హోటల్ నిర్వాహకుడా? లేక టీ స్టాల్ విక్రేత నా?

ధనవంతత్వం ఎక్కడ ఉంది?
మనస్సులోనా?
గుణం లోనా??
లేక దాచుకున్న డబ్బుకట్టలు - సంపదలలోనా???

చాలా సార్లు మనమందరం డబ్బు సంపాదన యావ లో పడి మనుషుల మన్న సంగతి మర్చిపోతుంటాము.

                                 -

యువతకు స్వేచ్ఛ

సమయం రాత్రి 10 గంటలు !
ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు.
"చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? " అని నిలదీసాడు కొడుకు .
"సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? వొచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం " అని తండ్రి బదులిచ్చాడు.కొడుకు సరే అన్నాడు . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు.
తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోట కి తీసుకెళ్ళి "నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగి రా అని బదులిచ్చాడు"కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు.తోటలో నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి."అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది . ఆరోగ్యం గా లేదు . మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగాడు
దానికి తండ్రి "మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు . లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ . అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ ఆరోగ్యం గా ఉన్నాయి. కానీ ఆ చెట్టు కి కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా స్వేఛ్చ గా పెరగనిద్దాము అని వదిలేసాము" అని బదులిచ్చాడు.కొడుకుకి విషయం అర్ధమయ్యింది
"అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో .. అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు , చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని. అంతే కానీ స్వేఛ్చని అడ్డుకోవాలని కాదు " అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు .
బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి తల్లి దండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని
ఆశిస్తూ.............

ఈ చిన్న కథ మీ మనసుని తాకితే నలుగురితో షేర్ చేసుకోగలరు..

Thursday, December 15, 2016

మినర్వా హోటల్ లో రూ.40కోట్లు మారుస్తూ..


సాయంత్రం ఆరుగంట‌ల‌కి ఐదు నిమిషాలు త‌క్కువ‌…. న‌గ‌రంలోని ఓ హోట‌ల్ ద‌గ్గ‌రకి ర‌య్.. రయ్.. అంటూ రెండు పోలీసు వాహ‌నాలు వెళ్లాయి.. అందులో నుంచి దాదాపు 5 నుంచి 10 దాకా పోలీసులు ఆ హోటలొకి వెళ్లారు… దీంతో మీడియా వాళ్లు కూడా వాలిపోయారు.. హోట‌ల్ లోప‌ల దాదాపు గంట‌పాటు పోలీసులు త‌నిఖీలు చేశారు.. ఇంత‌కీ  గంట‌పాటు ఆ హోట‌ల్ లో జ‌రిగిన హైడ్రామా ఏంటి..? పోలీసులు ఏం త‌నిఖీ చేశారు…? వారు అదుపులోకి తీసుకున్న‌వారెవ్వ‌రు..?

నెల్లూరు నగరంలో సాయంత్రం బ్లాక్ మనీ కలకలం రేపింది. న‌గ‌రం న‌డిబొడ్డున ఉండే ఓ హోట‌ల్ లో భారీ మొత్తం లో పాతనోట్లు మార్పిడి చేస్తున్నట్లు ఓ అప‌రిచితుడు పోలీసుల‌కు సమాచారం అందించారు. అస‌లే ఆక‌లిమీద ఉన్న పోలీసులు ఒక్క‌సారిగా రంగంలోకి దిగారు. తనిఖీలు నిర్వహించారు . ఓ న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఉంటున్న గదిని త‌నిఖీ చేశారు.. అప‌రిచితుడు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 100 కోట్లకు పైగా నగదు మార్పిడికి సిద్దమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.. దీనిపై నేరుగా సమాచారం వెల్లడించేందకు పోలీసులు నిరాకరిస్తున్నారు. వారు వచ్చిన వాహనాలు మాత్రం తెలంగాణా రిజిస్టేష‌న్ క‌ల్గి ఉన్నాయి.. వారు ఎవ్వ‌రో..? ఆడ‌బ్బు ఎక్క‌డి నుంచి తీసుకొచ్చారో..? ఎందుకు తీసుకొచ్చారో..? ఏ స్తాయిలో న‌గ‌దు మార్పిడి చేయ‌బోయారో పోలీసులు విచార‌ణ‌లో తేలనుంది..

నెల్లూరు: అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమంగా నగదు మార్పిడి జరగుతోంది. తాజాగా రియల్టర్లు, డాక్టర్లకు చెందిన నగదును మార్చుతూ నెల్లూరు పట్టణంలో ఓ ముఠా పోలీసులకు చిక్కింది. పట్టణంలోని మినర్వా హోటల్ లో పెద్ద ఎత్తున నగదు చేతులు మారబోతోందనే సమాచారంతో పోలీసులు హోటల్ పై దాడి చేశారు.

ఈ దాడుల్లో రూ.40కోట్ల నగదును మార్పిడి చేయడానికి యత్నిస్తున్న నలుగురు సభ్యుల బృందాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం నాలుగు బ్యాగుల్లో నగదును తెలంగాణకు చెందిన వ్యక్తుల ముఠా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

Wednesday, December 14, 2016

స్నేహం అంటే ఎలా ఉండాలో తెలుసా


ఇద్దరు స్నేహితులు ఒక ఎడారి గుండా ప్రయాణిస్తున్నారు. మాటల మధ్యలో ఒక వాదన వచ్చింది. అది పెరిగి క్రమంగా పెద్దదై ఆవేశానికి లోనై ఒక స్నేహితుడు రెండో స్నేహితుణ్ణి చెంప మీద కొట్టాడు. దెబ్బతిన్న మిత్రునికి చాలా బాధ కలిగింది. కానీ అతను తిరిగి ఏమీ మాట్లాడలేదు. కిందకు వంగి ఇసుకలో ఇలా రాశాడు.

“ఈ రోజు నా ప్రియ మిత్రుడు నన్ను చెంప పై కొట్టాడు”

అలా ఇద్దరూ నడుస్తూ ఒక ఒయాసిస్సు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ స్నానం చేసి సేద తీరాలనుకున్నారు. దెబ్బతిన్న స్నేహితుడు ప్రమాదవశాత్తూ ఒక ఊబిలో ఇరుక్కుపోయాడు. కానీ సమయానికి మిత్రుడు వచ్చి సహాయం చేయడంతో బ్రతికి బయటపడ్డాడు. మళ్ళీ ఏమీ మాట్లాడకుండా చిన్నగా ఒక రాయి దగ్గరికి వెళ్ళి మరో రాయితో దానిమీద ఇలా లిఖించాడు.

“ఈ రోజు నా ప్రియ మిత్రుడు నా ప్రాణాన్ని కాపాడాడు”

కాపాడిన మిత్రుడు అతన్ని ఇలా అడిగాడు. “నేను నిన్ను కొట్టినపుడు నువ్వు ఆ సంగతి ఇసుకలో రాశావు. కానీ నేను నిన్న కాపాడిన సంగతి మాత్రం రాతిమీద రాశావు. ఎందుకలా చేశావు?”

దానికి అతను ఇలా సమాధానమిచ్చాడు “మనల్ని ఎవరినైనా బాధించినపుడు దాన్ని ఇసుక పై రాత లాగా తాత్కాలిక జ్ఞాపకంగా ఉంచుకోవాలి. ఎందుకంటే క్షమ అనే గాలులు వచ్చినపుడు అవి చెరిగి పోతాయి. అలాగే మనకు ఎవరైనా సహాయం చేసినపుడు దాన్ని రాయి లాంటి జ్ఞాపిక మీద భద్రపరుచుకోవాలి ఎందుకంటే ఏ గాలులూ దాన్ని చెరపలేవు” ఇది మనందరి జీవితాలకి అన్వయించుకుని సంతోషమయం చేసుకుందాం.

Sunday, May 8, 2016

మన హక్కుల కోసం పోరాడుదాం

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
      అలాగే ఉండిపోతే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..
చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాల
రండి , దయచేసి అందరమూ కల్సి మన హక్కుల కోసం పోరాడుదము  , మన  గౌరవాన్ని కాపాడుకుందాం

Friday, February 19, 2016

ఈ మెసేజ్ Save చేసుకోండి..

దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!

దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.

సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.

ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.

తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా  సమస్య కూడా  రాదు

: తూట కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు

మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..

నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని…

స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.

చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.

: కష్టం అందరికీ శత్రువే, కానీ
కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.

ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.
అదే తేడా…

గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు.

నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.

స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.
🙏🙏🙏🚴🙏🙏🙏

కలగంటూ తన చేతినే తాను కొరుక్కుతిన్నాడు

బీజింగ్: సాధారణంగా నిద్రలో కలకనడం సహజం.. పక్కవాళ్లు భయపడేలా గట్టిగా నిద్రలోనే అరవడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఒక్కోసారి మంచంపై నుంచి దొర్లికిందపడటం కూడా జరుగుతుంది. ఇలాంటి కలలు కనే సమయంలో మనసు మాత్రమే పరుగెడుతుంది. శరీరం మాత్రం దానికి తగినట్లు ఎప్పుడోగానీ స్పందించదు. కానీ, చైనాలో మాత్రం ఓ యువకుడు హాయిగా కలలోకి జారుకొని మంచి రుచి కరమైన పోర్క్ లెగ్ పీస్ తింటున్నట్లుగా ఊహించుకొని తన చేతిని తానే కొరుక్కున్నాడు. రక్తం కారుతున్నా సోయిలేకుండా కండపీక్కొచ్చేలా కొరికేసుకున్నాడు.

మెలకువ వచ్చి చూసుకునే వరకు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ సీన్ చూసి బెంబేలెత్తిపోయి మెలకువలో కూడా గట్టిగా కేకలు వేయడం అతడివంతైంది. జిజియాంగ్ ప్రావిన్స్ లోని లాంగో పట్టణంలో లీ అనే 20 ఏళ్ల కుర్రాడు ఈ పనిచేశాడు. ఫిబ్రవరి 16న తన సోదరి ఇంటికి వెళ్లిన లీ ఆ రోజు హాయిగా వైన్ తాగాడు. రుచికరమైన భోజనం చేసి సోయిలేకుండా నిద్రపోయి ఆ నిద్రలో కలగని ఆ కలకు తగినట్లు ప్రవర్తించాడు. ఫలితంగా చేతికండ ఊడిరాగా తన నోరంతా రక్తంతో నిండింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతోపాటు వేరేవరో ఈ పనిచేసి ఉంటారని భ్రమపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.