Thursday, September 5, 2013

Neevu

నీవు

ఎదలో ఎన్నో భావాలు, ప్రాణం పోసే రూపాలు
ప్రతి కణం , అనుక్షనం ప్రతిధ్వనించే రాగాలు
చెప్పాలని ఉన్నా, గొంతు విప్పాలని ఉన్నా ఎందుకీ మౌనం?
నిజం తెలుసుకున్న ప్రాణం, మార్చునురా నీ నైజం.!నిరాశను వీడి చూడు ఒక్కసారి,
రహదారిలో నడిచిచూడు బాటసారి
గమ్యం తెలిసిన పయణం రా నీది,
జీవితం నేర్పిన  పాఠాలే పునాది.!

ఎవరో ఏదో అనుకుంటారనె ఆలోచనే అసలొద్దు,
మనసు చెప్పిందే వినరా, నింగే నీకు సరిహద్దు.
కృష్నుడు లేని కురుక్షేత్రం లో ఒంటరి వాడివి నీవేలే,
జననం మరణం సహజం రా, విజయం మాత్రం నీదేలే.!

చెరగని కలలే నీకుత్సాహం,
పడిలేచే అలలే నీకాదర్శం.
విజయం తోనె నీ బాంధవ్యం,
ప్రగతి పధం లో నీ భవితవ్యం.!

రెక్కలు వచ్చిన విహంగం లా, గగనం లో విహరించు
అంతే తెలియని తీరంలో, మునుముందుకే పయణించు
ఆంధ్యము తరిమి, వేకువ నింపే ప్రమిదవు రా,
ఉజ్జ్వలంగా ప్రజ్జ్వలించి కరిగిపోయే సమిదవురా.!

ఎందరో ఆప్తులు ఉండగ ఈ వేళ,
కాసులరాసులతొ పని నీకేల ?
మమతే కరువై, మనసే బరువైన నాడు,
లోకం శూన్యం, అల్లకల్లోలం చూడు.!

ఆగకపొంగే కన్నీళ్ళే కనబడకుండా దాచాలి,
హర్షించే వర్షం మాదిరిగ ఆకలి దప్పులు తీర్చాలి
నష్తాన్ని సైతం మరిపించి,కష్తాన్ని కూడ మురిపించు
వెతల స్మృతులు వదిలేసి, దరహాసపు వడిలో పవళించు.!

ఎదురు బెదురు లేదు, లేదు నీకు పోటి
లోకంలోనా, లోకుల్లోనా నీవేరా సరిసాటి
తలరాతని నమ్మే నిశ్చేస్టుడివి కావు,
తనరాతని రాసే నరేషుడివి నీవు.!

No comments:

Post a Comment