Thursday, December 15, 2016

మినర్వా హోటల్ లో రూ.40కోట్లు మారుస్తూ..


సాయంత్రం ఆరుగంట‌ల‌కి ఐదు నిమిషాలు త‌క్కువ‌…. న‌గ‌రంలోని ఓ హోట‌ల్ ద‌గ్గ‌రకి ర‌య్.. రయ్.. అంటూ రెండు పోలీసు వాహ‌నాలు వెళ్లాయి.. అందులో నుంచి దాదాపు 5 నుంచి 10 దాకా పోలీసులు ఆ హోటలొకి వెళ్లారు… దీంతో మీడియా వాళ్లు కూడా వాలిపోయారు.. హోట‌ల్ లోప‌ల దాదాపు గంట‌పాటు పోలీసులు త‌నిఖీలు చేశారు.. ఇంత‌కీ  గంట‌పాటు ఆ హోట‌ల్ లో జ‌రిగిన హైడ్రామా ఏంటి..? పోలీసులు ఏం త‌నిఖీ చేశారు…? వారు అదుపులోకి తీసుకున్న‌వారెవ్వ‌రు..?

నెల్లూరు నగరంలో సాయంత్రం బ్లాక్ మనీ కలకలం రేపింది. న‌గ‌రం న‌డిబొడ్డున ఉండే ఓ హోట‌ల్ లో భారీ మొత్తం లో పాతనోట్లు మార్పిడి చేస్తున్నట్లు ఓ అప‌రిచితుడు పోలీసుల‌కు సమాచారం అందించారు. అస‌లే ఆక‌లిమీద ఉన్న పోలీసులు ఒక్క‌సారిగా రంగంలోకి దిగారు. తనిఖీలు నిర్వహించారు . ఓ న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఉంటున్న గదిని త‌నిఖీ చేశారు.. అప‌రిచితుడు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 100 కోట్లకు పైగా నగదు మార్పిడికి సిద్దమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.. దీనిపై నేరుగా సమాచారం వెల్లడించేందకు పోలీసులు నిరాకరిస్తున్నారు. వారు వచ్చిన వాహనాలు మాత్రం తెలంగాణా రిజిస్టేష‌న్ క‌ల్గి ఉన్నాయి.. వారు ఎవ్వ‌రో..? ఆడ‌బ్బు ఎక్క‌డి నుంచి తీసుకొచ్చారో..? ఎందుకు తీసుకొచ్చారో..? ఏ స్తాయిలో న‌గ‌దు మార్పిడి చేయ‌బోయారో పోలీసులు విచార‌ణ‌లో తేలనుంది..

నెల్లూరు: అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమంగా నగదు మార్పిడి జరగుతోంది. తాజాగా రియల్టర్లు, డాక్టర్లకు చెందిన నగదును మార్చుతూ నెల్లూరు పట్టణంలో ఓ ముఠా పోలీసులకు చిక్కింది. పట్టణంలోని మినర్వా హోటల్ లో పెద్ద ఎత్తున నగదు చేతులు మారబోతోందనే సమాచారంతో పోలీసులు హోటల్ పై దాడి చేశారు.

ఈ దాడుల్లో రూ.40కోట్ల నగదును మార్పిడి చేయడానికి యత్నిస్తున్న నలుగురు సభ్యుల బృందాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం నాలుగు బ్యాగుల్లో నగదును తెలంగాణకు చెందిన వ్యక్తుల ముఠా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

No comments:

Post a Comment